విద్యారంగాన్ని ధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డిది ‘డైవర్షన్ పాలిటిక్స్’.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై జెన్-జీ (Gen-Z) ప్రశ్నిస్తుందనే భయంతోనే 21 ఏళ్ల వయస్సు అంశంపై సీఎం ‘డైవర్షన్ పాలిటిక్స్’. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.12 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి. యువతపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని, రాష్ట్ర విద్యాశాఖను యువకులకు అప్పగించాలి. మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. జేఎన్‌టీయూ పరిశోధనాత్మక గ్రంథం ‘శ్రీమన్ భగవద్గీత’ పుస్తకం ఆవిష్కరణ.

హైద్రాబాద్ జులై 27,అర్జున్ సమాచారం: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీల నుంచి ప్రజల మరియు జెన్-జీ (Gen-Z) యువత దృష్టిని మళ్లించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుండి 21 ఏళ్లకు తగ్గించాలనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  ఎన్. రాంచందర్ రావు  విమర్శించారు.  రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు శాసనసభ్యుడికి అనుభవం అవసరమనే దూరదృష్టితోనే 25 ఏళ్ల వయస్సును నిర్ణయించారని, ఇప్పుడు సీఎం చేస్తున్నది...