విద్యార్థులకు విజయ్‌ సర్కార్‌ భారీ కానుక.. ఏకంగా రూ.2,000 కోట్లు విద్యార్థుల ఉచిత ల్యాప్‌టాప్‌ల కోసం రూ.2,000 కోట్లు మంజూరు పథకానికి ‘వెట్రి ల్యాప్‌టాప్‌ స్కీమ్‌’గా పేరు డిగ్రీ, డిప్లొమా మొదటి, రెండో ఏడాది విద్యార్థులకు అవకాశం పలు ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకూ వర్తింపు ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌ ఉండేలా నిర్ణయం

 అర్జున్ సమాచారం: తమిళనాడు విద్యార్థులకు ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ శుభవార్త చెప్పారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించేందుకు రూ.2,000 కోట్లు మంజూరు చేశారు. 'వెట్రి ల్యాప్‌టాప్‌ పథకం' పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో మొదటి, రెండో ఏడాది డిగ్రీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు. ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఆర్ట్స్‌,...