ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 8:36 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారం అందించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,అర్జున్ సమాచారం:
:
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న అల్పాహారం పోషక విలువలతో సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల కేంద్రీకృత వంటశాల ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఈ క్రమంలో హరే కృష్ణ ఫౌండేషన్ వారు కార్యక్రమం నిర్వహణకు ముందుకు రావడం సంతోషంగా ఉందని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం వేళలో పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం ఏకాగ్రత విద్యాభ్యాసానికి తోడ్పడుతుందని తెలిపారు. అనంతరం ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 23.75 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు ప్రజల సంక్షేమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
============================