విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ బాధ్యత… చల్లూర్ ఉర్దూ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్,అర్జున్ సమాచారం: వీణవంక మండలం చల్లూర్ గ్రామంలోని ఉర్దూ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే  పాడి కౌశిక్ రెడ్డి  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన విధానం, తరగతి గదుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం నాణ్యత, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య పరిస్థితులు, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పోషకాహారం, నమోదు వివరాలు, నిర్వహణను...