విద్యార్థుల విద్యాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా ఎంపీ గడ్డం వంశీకృష్ణ సుల్తాన్పూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ
సుల్తానాబాద్,అర్జున్ సమాచారం: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన ఎంపీ వారి చదువులు, పాఠశాలలోని సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో తాగునీటి సమస్యతో పాటు ఉపాధ్యాయుల కొరత ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎంపీ పాఠశాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల జిల్లా...