ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 7:10 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

విద్యార్థుల విద్యా క్షేత్ర పర్యటన రాముని గుండాలకు ఫీల్డ్ ట్రిప్

గోదావరిఖని,అర్జున్ సమాచారం:
విద్యార్థులకు తరగతి గది బోధనతో పాటు ప్రత్యక్ష అనుభవం ద్వారా విజ్ఞానాన్ని అందించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, గోదావరిఖని లో డా. పి. సవిత నేతృత్వంలో వృక్షశాస్త్ర విభాగం విద్యార్థులకు మరియు డా. జీ. శారద నేతృత్వంలో భౌతిక శాస్త్ర విభాగం విద్యార్థులకు ఉభయుల సంయుక్త ఆధ్వర్యంలో రాముని గుండాలకు ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు.

ఈ విద్యా విహారయాత్రలో విద్యార్థులు అధ్యాపకులతో కలిసి రామగుండం లోని రాముని గుండాలను సందర్శించారు. అక్కడి ప్రకృతి అందాలు, భౌగోళిక విశేషాలు మరియు పర్యావరణ సంరక్షణ వ్యవస్థల ప్రాధాన్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. అధ్యాపకులు విద్యార్థులకు అక్కడి సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రకృతితో మానవ సంబంధం గురించి వివరించారు. వన్య ప్రాణులు జనా వాసం లోకి రావడాన్ని నివారించుటకు ఫల వృక్షంలను పెంచడానికి
విత్తన బంతులను (సీడ్ బాల్స్) విద్యార్థులు మరియు అధ్యాపకులు
ఎంతో ఉత్సాహంగా వెదజల్లారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి అధ్యాపకుల బృందం శ్రీదేవి, సుమలత, నివేదిత పాల్గొని, ప్రకృతి మరియు పరిసరాలను పరిశీలించి విద్యార్థులను గైడ్ చేసారు. ఈ ఫీల్డ్ ట్రిప్ ద్వారా విద్యార్థుల్లో పరిశీలనా దృక్పథం, బృంద స్ఫూర్తి, పర్యావరణ అవగాహన మరియు ఆచరణాత్మక జ్ఞానం పెంపొందాటుతుందని డా. పి. సవిత మరియు డా.జీ శారద వివరించారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రిన్సిపాల్ కి, అధ్యాపకులకు మరియు సిబ్బందికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు ఇలాంటి విద్యా విహారయాత్రలు మరింత జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయని నిర్వాహకులు సవిత మరియు శారద తెలిపారు
————————-