విద్యార్థుల విద్యా క్షేత్ర పర్యటన రాముని గుండాలకు ఫీల్డ్ ట్రిప్

గోదావరిఖని,అర్జున్ సమాచారం: విద్యార్థులకు తరగతి గది బోధనతో పాటు ప్రత్యక్ష అనుభవం ద్వారా విజ్ఞానాన్ని అందించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, గోదావరిఖని లో డా. పి. సవిత నేతృత్వంలో వృక్షశాస్త్ర విభాగం విద్యార్థులకు మరియు డా. జీ. శారద నేతృత్వంలో భౌతిక శాస్త్ర విభాగం విద్యార్థులకు ఉభయుల సంయుక్త ఆధ్వర్యంలో రాముని గుండాలకు ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. ఈ విద్యా విహారయాత్రలో విద్యార్థులు అధ్యాపకులతో కలిసి రామగుండం లోని రాముని గుండాలను సందర్శించారు. అక్కడి ప్రకృతి అందాలు, భౌగోళిక విశేషాలు మరియు పర్యావరణ...