విద్యుత్ కొరత లేకుండా చూస్తున్నాం : మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ,అర్జున్ సమాచారం: రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నల్గొండ పట్టణంలో గాంధీ జయంతి కార్యక్రమాలు ముగించుకుని నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తాను సబ్‌స్టేషన్లలో లాగ్‌బుక్‌లు పరిశీలించిన విషయం వాస్తవమేనని మంత్రి తెలిపారు. అప్పట్లో కొందరు ఆపరేటర్లు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్...