వినియోగ దారునికి నాణ్యమైన బొగ్గును అందించాలి క్వాలిటీ జి.ఎం
కమాన్ పూర్,అర్జున్ సమాచారం: వినియోగ దారునికి నాణ్యమైన బొగ్గును అందించాలని రామగుండం రీజియన్ నాణ్యత విభాగం జనరల్ మేనేజర్ జె.వెంకటరమణ అన్నారు. ఆయన బుధవారం రామగుండం-3 ఏరియాలో పర్యటించారు.నూతనంగా రామగుండం రీజియన్ నాణ్యత విభాగం జనరల్ మేనేజర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా ఏరియాలో పర్యటించిన సందర్భంగా జి.యం. కార్యాలయం నందు రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, ఇతర అధికారులు వారిని శాలువాతో సత్కరించి, మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాణ్యత విభాగం జి.ఎం మాట్లాడుతూ...