ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 8:08 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వియత్నాంలో భారీ విషాదం బోటు మునిగి 15 మంది మృతి

న్యూ డిల్లి, జులై 11,అర్జున్ సమాచారం:

వియత్నాంలో భారీ విషాదం జరిగింది. భారత టూరిస్టులు ప్రయాణిస్తున్న బోటు ఒకటి నీట మునిగింది. ఈ ప్రమాదంలో పర్యాటకులు గల్లంతయ్యారు. వియత్నాంలోని ఫు క్యూక్‌ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో తెలుగువారు కూడా ఉన్నారు. ఈ మేరకు వియత్నాం హనోయిలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఎక్స్లో పోస్టు షేర్ చేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు!
ఇటీవల ఓ మొబైల్ కంపెనీ 250 మందితో కూడిన ఒక బృందాన్ని భారత్‌ నుంచి వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. వీళ్లంతా మొబైల్ కంపెనీకి చెందిన డిస్ట్రిబ్యూటర్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో 40 మంది తెలంగాణ, 35 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు.
==========================