వియత్నాంలో భారీ విషాదం బోటు మునిగి 15 మంది మృతి
న్యూ డిల్లి, జులై 11,అర్జున్ సమాచారం: వియత్నాంలో భారీ విషాదం జరిగింది. భారత టూరిస్టులు ప్రయాణిస్తున్న బోటు ఒకటి నీట మునిగింది. ఈ ప్రమాదంలో పర్యాటకులు గల్లంతయ్యారు. వియత్నాంలోని ఫు క్యూక్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో తెలుగువారు కూడా ఉన్నారు. ఈ మేరకు వియత్నాం హనోయిలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఎక్స్లో పోస్టు షేర్ చేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తెలుగు...