వృషకర్మ’ ఏపీ, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న దిల్ రాజు

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా  ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా  ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా ‘వృషకర్మ’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్...