వెంకన్న సన్నిధి… వికలాంగుల పెన్నిధి తిరుమల వెళ్లలేని దివ్యాంగుల కోసం “ట్రస్ట్” సాయం ఖర్చులన్నీ వాళ్లవే ఏడుకొండలవాడి చెంతకు వెళ్లలేని వారికి అండగా నిలుస్తోన్న “శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్”
హైదరాబాద్,అర్జున్ సమాచారం: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భారత పుణ్యక్షేత్రాలలో "తిరుమల" ఒకటి. ఏడుకొండలపై విష్ణుమూర్తి అవతారంలో కొలువై ఉన్న ఆ వేంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం ఎంతో మంది భక్తులు తరలి వెళ్తుంటారు. ఆ కోనేటి రాయుడిని కనులారా చూసి, మనసారా వేడుకుంటారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటుంటారు. అయితే, చాలా మంది భక్తులు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా దర్శించుకుంటే మరి కొద్దిమంది మాత్రం జీవితంలో ఒక్కసారి దర్శించుకున్నా చాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఒక్కసారి కూడా ఏడుకొండలవాడిని చూసుకోలేని వారికి అండగా నిలుస్తోంది...