వెయ్యి కి.మీ. రేంజ్ మిస్సైళ్లు… శిక్షణ కోసం భారత్ వైపు జపాన్ చూపు య్యి కి.మీ. రేంజ్ మిస్సైళ్లు… శిక్షణ కోసం భారత్ వైపు జపాన్ చూపు జపాన్ సైన్యానికి భారత్‌లో శిక్షణ ఇచ్చేందుకు యత్నాలు ఉపరితలం నుంచి నౌకలను ఛేదించే క్షిపణులపై తర్ఫీదు వెయ్యి కిలోమీటర్ల రేంజ్ మిస్సైళ్లకు జపాన్‌లో శిక్షణ కష్టతరం భారత్‌తో చర్చలకు సిబ్బందిని పంపామన్న జపాన్ జనరల్ ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకే ఈ చర్య

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: భారత్, జపాన్ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. తమ సైన్యానికి అత్యాధునిక క్షిపణుల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు భారత్‌లోని శిక్షణా కేంద్రాలను వినియోగించుకోవాలని జపాన్ భావిస్తోంది. ఈ మేరకు తమ సిబ్బందిని చర్చల కోసం భారత్‌కు పంపినట్లు జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జీఎస్‌డీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మసయోషి అరాయ్ స్వయంగా వెల్లడించారు. సుమారు 1,000 కిలోమీటర్ల పరిధి కలిగిన ఉపరితలం నుంచి నౌకలను ఛేదించే క్షిపణులపై సమర్థవంతమైన శిక్షణ ఇవ్వడం తమకు పెద్ద సవాలుగా...