వేప చెట్టు విషయంలో గొడవ.. ఇద్దరు మృతి నల్గోండ

నల్గోండ,అర్జున్ సమాచారం: మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. గొడ్డళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు.  ఘటనా స్థలంలోమందా  వెంకటేశ్వర్లు యాదవ్ మృతి చెందాడు.  ఆస్పత్రికి తరలిస్తుండగా సైదా మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఫ్యాక్షన్ తరహలో ఇరువర్గాలు ఇళ్లపై దాడులు చేసుకున్నాయి. విషయం తెలిసి ఘటనా స్థలానికి  మేళ్లచెరువు పోలీసులు చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నంతో ఆగ్రహంతో ఎస్ఐ నవీన్ పై  ఒక...