వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపావళి.. అధ్యక్షుడికి ‘హనుమాన్ చాలీసా’ బహుమతి వైట్‌హౌస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు జరిపిన ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో దీపం వెలిగించి వేడుకలను ప్రారంభించిన అధ్యక్షుడు ట్రంప్‌కు హనుమాన్ చాలీసాను బహూకరించిన వ్యాపారవేత్త విశాల్ గోండల్ పాల్గొన్న భారత రాయబారి, ప్రముఖ భారతీయ అమెరికన్ సీఈఓలు భారత్-అమెరికా మైత్రి వర్ధిల్లాలని, చీకటిపై వెలుగు గెలవాలని ఆకాంక్ష
అర్జున్ సమాచారం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోని తన అధికారిక కార్యాలయం ఓవల్ ఆఫీస్‌లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్తలు, సీఈఓలు, ఆయన ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ స్వయంగా దీపం వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకకు అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ జయ్...