వైభవంగా శ్రీవారి రథోత్సవం భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు గోవిందనామస్మరణతో మారుమోగిన తిరుమాడ వీధులు
అర్జున్ సమాచారం: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని రథాన్ని లాగి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. స్వామివారు రథంపై విహరిస్తుండగా భక్తులు అడుగడుగునా హారతులు సమర్పిస్తూ, “గోవిందా.. గోవిందా” అంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. గోవిందనామస్మరణతో తిరుమాడ వీధులు మారుమోగాయి. ఆర్ష...