వైసీపీ ఐదేళ్ల కంటే.. ఈ రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం పల్లె పండుగ 1.0, 2.0తో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు 100 రెట్లు ఎక్కువగా మినీ గోకులాలు బ్లీచింగ్ పౌడర్ కొనలేని స్థితి నుంచి.. సొంతంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీలను తీసుకొచ్చాం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 6,500 కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణం అడవి తల్లిబాటలో 1,500 కి.మీ.కు పైగా రహదారుల నిర్మాణం గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0 పల్లె పండుగ 3.0లో 6 వేల కి.మీ. సీసీ రోడ్లు, 9,500 కి.మీ. బీటీ రోడ్లు 22,500 మినీ గోకులాలు.. 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు • కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధికి భారీ కార్యాచరణ • ప్రజల భాగస్వామ్యంతోనే పారదర్శక గ్రామీణ అభివృద్ధి • అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరం ఉదయగిరి వేదికగా రూ.11,085 కోట్ల పల్లెపండుగ 3.0కు శ్రీకారం • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కలిసి పనులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అర్జున్ సమాచారం: ‘పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేలా, ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రహదారులు, తాగు నీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతోపాటు పర్యాటక రంగానికీ ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ‘పల్లె పండుగ 3.0’కు శ్రీకారం చుట్టామ’ని ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  తెలిపారు. పల్లె బలపడితేనే రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుందనే సంకల్పంతో ప్రతి పల్లెను అభివృద్ధికి చిరునామాగా...