శబరిమలలో పంబ నది కాలుష్యంపై కఠిన నిబంధనలు – నదిలో వస్త్రాలు, చెత్త వేస్తే అప్పటికప్పుడే జరిమానా – నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యల హెచ్చరిక – రెండు నెలల పాటు అమల్లో ఉండనున్న నిషేధాజ్ఞలు కేరళభక్తుల కోసం తెలుగులోనూ ప్రచార ఏర్పాట్లు

శబరిమల,అర్జున్ సమాచారం: మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ (2026-27) సందర్భంగా పవిత్ర పంబ నదిలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు కేరళ యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. నదిలో వాడిన వస్త్రాలు, ప్లాస్టిక్ లేదా ఇతర చెత్త వేసే భక్తులకు అక్కడికక్కడే రూ. 5,000 వరకు జరిమానా విధించనున్నట్లు శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్ దిలీప్ కె.కైనిక్కర స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నవంబర్ 22న నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, పంబ నది, దాని ఉపనదులు, స్నాన ఘట్టాల వద్ద వాడిన...