శబరిమలలో ప్రారంభమైన వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర మంగళవారం వేకువజాము నుంచే అయ్యప్ప దర్శనానికి భక్తుల అనుమతి – రోజుకు 80 వేల మంది దర్శించుకునేలా ఆలయ బోర్డు ఏర్పాట్లు – పంబ, సన్నిధానం వద్ద 5 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు – తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు

శబరిమల:అర్జున్ సమాచారం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో రెండు నెలల పాటు సాగే వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర మంగళవారం నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. మలయాళ మాసం ‘వృశ్చికం’ మొదలవుతుండటంతో కొండపై ‘స్వామియే శరణం అయ్యప్ప’ నామస్మరణ మార్మోగుతోంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకే ఆలయ ద్వారాలు తెరుచుకోనుండగా, మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మొదటి రోజే స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో కొండ దిగువకు చేరుకున్నారు. కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక...