శాంతిభద్రతలతోనే అభివృద్ధి, పెట్టుబడులు పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
విజయవాడ, అక్టోబరు 21, అర్జున్ సమాచారం: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజకీయ ముసుగులో అరాచకాలు, రౌడీయిజం చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేరస్తులకు పోలీసు యూనిఫాం చూస్తే భయం కలగాలని, అదే సమయంలో బాధితులకు పూర్తి భరోసా లభించాలని ఆయన ఆకాంక్షించారు. మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో నేడు నిర్వహించిన 'పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు....