శాంతియుత పోరాటాల ద్వారా సామాజిక మార్పు సాధించడమే గాంధీజీ ఆశయం: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

అర్జున్ సమాచారం: మహాత్మాగాంధీ అనుసరించిన ప్రజాస్వామిక శాంతియుత పోరాట కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తనకు స్ఫూర్తిగా నిలిచిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ప్రజాస్వామిక హక్కుల సాధనకోసం గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికీ ఆచరణీయమన్నారు. గాంధీ జయంతి సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం వారి త్యాగనిరతని స్మరించుకుంటూ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. న్యాయమైన ప్రజల ఆకాంక్షల కోసం, నిరంకుశ ప్రభుత్వాల మీద పోరాడే నాయకత్వం, విశాల దృక్పథంతో తమ పోరాట కార్యాచరణను రూపొందించుకోవాలనే తాత్వికతను గాంధీజీ...