;శిథిలావస్థలో కిషన్ నగర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల పెచ్చులు ఊడిపోతున్నా పట్టించుకోని అధికారులు

రంగారెడ్డి,అర్జున్ సమాచారం: షాద్‌నగర్ నియోజకవర్గ పరిధి కిషన్ నగర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణభయంతో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. పైకప్పు, గోడలు దెబ్బతినడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది.నాలుగు రోజుల క్రితం పాఠశాలలోని ఒక గదిలో పైపెచ్చు ఊడి ఆయమ్మ మెడపై పడటంతో ఆమె గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు శాశ్వత చర్యలు చేపట్టకపోవడం పట్ల...