ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 7:49 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

శీను బాబు సమక్షంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి జన్మదిన వేడుకలు.

కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
కమాన్ పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్ జన్మదిన వేడుకలు పిసిసి ప్రధాన కార్యదర్శి శీను బాబు సమక్షంలో బుధవారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలోని శ్రీ ఆదివారా స్వామి ప్రాంగణంలో సయ్యద్ ఇక్బాల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శీను బాబు సమక్షంలో కేక్ కట్ చేసి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్ సయ్యద్ అన్వర్, సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, అంబిలి శ్రీనివాస్, రెబల్ రాజ్ కుమార్, కిషన్ రెడ్డి, ఉప సర్పంచ్ సోహెల్, జెమినీ గౌడ్, మల్యాల మహేష్ గౌడ్, లల్లు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
===========================