శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి తిరుమల,
తిరుమల,అర్జున్ సమాచారం: భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉప రాష్ట్రపతి శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు ఉప రాష్ట్రపతి చేరుకోగానే టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. తరువాత ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అటు పిమ్మట శ్రీ వకుళామాత, విమాన...