శ్రీవారి భక్తులను మోసగిస్తున్న 249 వెబ్ సైట్లు
తిరుమల సెప్టెంబర్ 2,అర్జున్ సమాచారం: కిలీ వెబ్‌సైట్ల గురించి తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ మరోసారి అప్రమత్తం చేసింది. గదుల కేటాయింపు పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ.. పోస్టర్లు, తప్పుడు హామీలతో భక్తులను మోసం చేస్తున్న 249 నకిలీ వెబ్‌సైట్‌లను ఈ సంవత్సరం ఇప్పటివరకు గుర్తించినట్లు టీటీడీ తెలిపింది. ఆ ఫేక్ వెబ్‌సైట్లను తొలగించామని.. రెండు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో టీటీడీ పేరుతో కనిపించే నకిలీ వెబ్‌సైట్‌లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులను హెచ్చరించింది. శ్రీవారి దర్శనం,...