ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 6:14 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు

తిరుమల, 19 సెప్టెంబరు 2026:అర్జున్ సమాచారం:                                                                                      శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన ఈ శనివారం ఉదయం తిరుమలలో జరిగిన మోహినీ అవతార వాహన సేవను టీటీడీ ఈఓ ముద్దడ రవీంద్ర, అదనపు ఈఓ  చి. వెంకయ్య చౌదరి, జేఈవో డా. ఎ. శరత్, ఎస్వీబీసీ ఛైర్మన్  బి. శ్రీధర్ వర్మ, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్ఓ)  మురళీకృష్ణ మరియు టీటీడీ మాజీ ఛైర్మన్  కనుమూరి బాపిరాజు పర్యవేక్షించారు; ఈ సందర్భంగా  కనుమూరి బాపిరాజు  ఎస్వీబీసీ ఛైర్మన్  బి. శ్రీధర్ వర్మను కలిసి, ఆయన ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందించడమే కాకుండా, తమ ఆనందాన్ని వ్యక్తం చేసి, భవిష్యత్తులో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు, దీనికి ప్రతిగా ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆరోగ్యంగా ఉండాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ముందుముందు మీ విలువైన సలహాలు, సూచనలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
=============================