శ్రీశైలం ఇవోఆకస్మిక పరిశీలన
అర్జున్ సమాచారం: కార్యనిర్వహణాధికారి . శ్రీనివాసరావు పలు ప్రదేశాలను ఆకస్మికంగా పరిశీలించారు. పాతాళగంగ స్నానఘట్టాలు, సిద్ధరామప్ప వాణిజ్య సముదాయం, పలు ప్రదేశాలలోని శౌచాలయాలు మొదలైనవాటిని కార్యనిర్వహణాధికారి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారన్నారు. అందుకే పాతాళగంగ పరిసరాలను, పాతాళగంగమెట్లను, ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తుండాలని పారిశుద్ధ్య విభాగపు అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు పాతాళగంగ పరిసరాలలో మరియు మెట్ల మార్గంలో మరిన్ని విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. పాతాళగంగలో మరిన్ని సూచికబోర్డులను ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ మరియు...