శ్రీ భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు…

జమ్మికుంట,అర్జున్ సమాచారం: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం శనివారం నాడు శ్రీ భక్తాంజనేయ స్వామి వారికీ సహస్ర నాగవల్లి దళ (తమలపాకులు)అర్చన మరియు ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు రామచందర్రావు నిర్వహించారు. భక్తులు తీసుకువచ్చిన నాగవల్లి దళాల (తమలపాకులు) తో స్వామివారికి ఆకర్షణీయంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు... ======================