శ్రీ భీమేశ్వర ఆలయం లడ్డు కౌంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈవో
వేములవాడ,అర్జున్ సమాచారం: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలోని లడ్డు కౌంటర్‌ను దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఈవో ఎల్. రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లడ్డు, పులిహోర ప్రసాదాల నాణ్యతను పరిశీలించి, భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందేలా ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే కౌంటర్లలో పారిశుద్ధ్య పరిస్థితులు, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదేవిధంగా, లడ్డు, పులిహోర ప్రసాదాలను కొనుగోలు చేసిన భక్తులను, చిన్నపిల్లలను స్వయంగా పలకరించి ప్రసాదాల...