శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ న్యూమూవీ గ్లింప్స్
యువ కథానాయకుడు శ్రీ విష్ణు, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ప్రొడక్షన్ నం.39. నేటి యువత జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, ఆశలు, ఆకాంక్షలు, సవాళ్లను ప్రతిబింబించే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సన్నివేశాలు, అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఓ సరికొత్త ప్రయాణాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మేకర్స్ తాజాగా ఓ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేశారు. యువత జీవితానికి దగ్గరగా ఉండే...