షావుకారు జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం హైదరాబాద్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి  మరణించారని తెలిసి ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్ను ప్రారంభించిన షావుకారు జానకి  దాదాపు ఏడు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. ‘షావుకారు’ సినిమాలో అసమాన ప్రతిభ కనబరిచి షావుకారు జానకిగా స్థిరపడ్డారని గుర్తుచేస్తూ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లోనే కాకుండా హిందీ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను...