షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి… ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందాలి… ఎస్.సి. బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ కి చర్యలు తీసుకోవాలి… జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా…
తిరుపతి,అర్జున్ సమాచారం: తిరుపతి జిల్లాలో షెడ్యూల్డ్ కులాల ( ఎస్సీ ) సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ఆదేశించారు. శుక్రవారం శ్రీ పద్మావతి అతిథి గృహంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మరియు కమిషన్ అధికారులతో కలిసి ఆయన సాంఘిక సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఎస్సీ...