సంగీత్’ మూవీ నుంచి తొలిపాట ‘నీ వల్లే’ విడుదల
*తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన 'ఎక్స్' ద్వారా చిత్ర గీతాన్ని విడుదల చేసిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ అచు రాజామణి మెలోడీకి విక్రమ్ శివ హృద్యమైన సాహిత్యం.. నిఖిల్ విజయేంద్ర సింహా, తేజు అశ్విని జంటను పరిచయం చేసిన అందమైన ప్రేమగీతం ఇది. యువతను ఆకట్టుకునే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ‘సంగీత్’ నుంచి తొలి పాట ‘నీ వల్లే’ విడుదలైంది. కథానాయకుడు నిఖిల్ విజయేంద్ర సింహా ఆయన అభిమానులకు, సంగీత ప్రియులకు ‘నీ వల్లే’ ఒక ప్రత్యేకమైన మ్యూజికల్ ట్రీట్‌గా నిలిచింది....