సఖి కేంద్రం సేవలు మరింత సమర్థవంతంగా అందించాలి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్
కరీంనగర్,అర్జున్ సమాచారం: మహిళలకు రక్షణ, న్యాయ సహాయం, కౌన్సెలింగ్‌తో పాటు అవసరమైన సేవలను అందిస్తున్న సఖి వన్‌స్టాప్ సెంటర్ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ సూచించారు. శుక్రవారం ప్యానల్ అడ్వకేట్లతో కలిసి కరీంనగర్ సఖి వన్‌స్టాప్ సెంటర్‌ను సందర్శించిన ఆయన, కేంద్రంలో నమోదవుతున్న కేసులు, బాధితులకు అందుతున్న న్యాయ సహాయం, కౌన్సెలింగ్, వైద్య సహాయం, తాత్కాలిక ఆశ్రయం తదితర సేవలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు, కేసు ఫైళ్లు, రికార్డులను పరిశీలించి,...