ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:25 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సచివాలయంలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి.  సెక్రటేరియట్ ఆవరణలోని టెంపుల్ వద్ద ఒక అధికారి  లంచం తీసుకుంటగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో రెండు లక్ష రూపాయల కు గాను లక్ష రూపాయలు సదరు అధికారి  లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.  లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ  పట్టుకుంది. సచివాలయంలోని సెక్షన్ ఆఫీసర్ వినోద్ తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్ర లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.
======================