సత్తాచాటిన అన్నమయ్య జిల్లా క్రీడాకారులు
రాయచోటి,అర్జున్ సమాచారం: అమరావతి ఛాంపియన్‌షిప్–2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లోఅన్నమయ్య జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో జిల్లా కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటారు.వివిధ క్రీడాంశాల్లో రాణించిన క్రీడాకారులుబ్యాడ్మింటన్‌లో మోతుకూరి కళ్యాణి, కందుకూరి లక్ష్మీ సింధూర ద్వితీయ స్థానాలు సాధించి రజత పతకాలు పొందారు. బాక్సింగ్‌లో సిరివెలు నిఖిల్ దేవ్ నాయుడు ద్వితీయ స్థానం సాధించగా, అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో సుంకు గంగాధర్ ద్వితీయ స్థానం సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.క్రీడాకారులను అభినందించిన జిల్లా...