సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ రెడ్డి
కమాన్ పూర్,అర్జున్ సమాచారం: కమాన్ పూర్ మండలంలోని సమస్యలను జిల్లా కలెక్టర్ కు తీసుకెళ్లడం జరుగుతుందని మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ రెడ్డి అన్నారు. గురువారం ఎంపీడీవో సాదినేని ప్రియాంక అధ్యక్షతన కమాన్ పూర్ మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు సర్పంచులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించాలని, చాలా గ్రామాల్లో విద్యుత్ లైన్లు లూప్ గా ఉన్నాయని , గొల్లపల్లెలో త్రాగునీటి సమస్య ఉందని, గుండారం పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుని నియమించాలని, సర్పంచులు రంగు సత్యనారాయణ గౌడ్, షీలారపు...