‘సరయూ-కమల ఎక్స్‌ప్రెస్’కు మోదీ, నేపాల్ ప్రధాని పచ్చజెండా

ఢిల్లీ / అయోధ్య, నవంబర్ 23: అర్జున్ సమాచారం: భారత్-నేపాల్ మధ్య రైల్వే అనుసంధానాన్ని, సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో చారిత్రక అడుగు పడింది. శ్రీరాముడి జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, సీతాదేవి జన్మస్థలమైన నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్‌ లను నేరుగా అనుసంధానించే కొత్త వీక్లీ రైలు 'సరయూ-కమల ఎక్స్‌ప్రెస్'  ను ఇవాళ (నవంబర్ 23) భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే...