సరిహద్దు నిర్వహణ ఆధునీకరణ కు ఎస్ఎస్ బీ క్రుషి భేష్ వ్యవస్థీక్రుత నేరాల నియంత్రణలో ఎస్ఎస్ బీ సేవలు అభినందనీయం సంక్షేమ కార్యక్రమాల్లోనూ ఎస్ఎస్ బీ ముందంజ జవాన్ల సంక్షేమానికి మోదీ సర్కార్ కు అత్యంత ప్రాధాన్యత అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలోనూ అగ్రభాగాన ఎస్ఎస్ బీ విపత్తు సేవలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోనూ ఎస్ఎస్ బీ సేవలు భేష్ జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోదు జవాన్ల జీవన ప్రమాణాల పెంపుకు చిత్తశుద్దితో క్రుషి చేస్తున్నాం లక్నోలో ఎస్ఎస్ బీ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పలు అభివ్రుద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన బండి సంజయ్

అర్జున్ సమాచారం: భారత్–నేపాల్, భారత్–భూటాన్ దేశాల మధ్య ఉన్న సుమారు 2,450 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుకు భద్రత కల్పించే విషయంలో ఎస్ఎస్ బి సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యంగా సరిహద్దు నిర్వహణను ఆధునికీకరించే దిశగా సశస్త్ర సీమా బల్ నిరంతరం కృషి చేస్తుండటం సంతోషదాయకమన్నారు.  డ్రోన్లు, CCTV నిఘా వ్యవస్థలు, థర్మల్ ఇమేజర్లు, నైట్ విజన్ పరికరాలు, GPS ఆధారిత గస్తీ, సురక్షిత డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, GIS ఆధారిత ప్రణాళిక వంటి...