‘సర్’ పేరుతో మోదీ సర్కార్ ఓట్లను తొలగిస్తోంది: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, నవంబరు 11:అర్జున్ సమాచారం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ తొలగించాలంటున్న బీజేపీ నేతలు.. గుజరాత్లో ఎందుకు తొలగించడం లేదు? అని ప్రశ్నించారు. మైనారిటీలకు ఓటు హక్కును దూరం చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ బంజారాభవన్లో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఈరోజు (బుధవారం) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని, ప్రసంగించారు. సర్ (ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ) పేరుతో మైనారిటీలు, దళితులు,...