సింగరేణిని కాపాడింది బీజేపీయే.. భట్టి విక్రమార్క వాస్తవాలు గుర్తు చేసుకుని మాట్లాడాలి: చందుపట్ల సునీల్‌రెడ్డి

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 15: సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, మంథని అభివృద్ధే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని, సింగరేణి విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వాస్తవాలు గుర్తు చేసుకుని మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చందుపట్ల సునీల్‌రెడ్డి అన్నారు. మంథనిలోని రామ్‌రెడ్డి కాంప్లెక్స్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి నాయకత్వంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర కార్మికులు, ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపిందన్నారు. ఈ యాత్రలో...