సింగరేణిలో తగ్గుతున్న కార్మికుల సంఖ్య.. వెలవెలబోతున్న కార్మికవాడలు కొత్త నియామకాలు లేక, గనుల మూతతో ప్రశ్నార్థకంగా మారుతున్న ఏరియాల భవిష్యత్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 27,అర్జున్ సమాచారం: ఒకప్పుడు బొగ్గు గనులు, వేలాది మంది కార్మిక కుటుంబాలతో కళకళలాడిన సింగరేణి ప్రాంతాలు నేడు కార్మికుల కొరతతో వెలవెలబోతున్నాయి. ఓ వైపు బొగ్గు గనులు క్రమంగా మూతపడుతుండగా.. మరోవైపు సింగరేణి యాజమాన్యం కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో కార్మికవాడలు బోసిపోతున్నాయి. గనుల మూతతో ఇంతకాలం పనిచేసిన కార్మికులు ఇతర ప్రాంతాలకు తరలిపోతుండటంతో పలు ఏరియాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకప్పుడు సింగరేణిలో ఉద్యోగం అంటేనే భయపడే పరిస్థితి ఉండేది. బొగ్గు గనుల్లో పనిచేయడానికి చాలామంది వెనుకంజ వేసేవారు. అయితే...