‘సింగరేణిలో మెడికల్ అటెండెన్స్ నిబంధనలు మార్చాల్సిందే’ – అనారోగ్య కార్మికులను ఇబ్బందిపెట్టొద్దు – గతంలో మాదిరిగా ఇన్వాలిడేషన్ చేసి కార్మిక కుటుంబాలకు అండగా నిలవాలి – ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య
రుద్రంపూర్, అక్టోబర్ 06,అర్జున్ సమాచారం: సింగరేణిలో మెడికల్ అటెండెన్స్ నిబంధనలను వెంటనే మార్చి, అనారోగ్య కారణాలతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు గతంలో మాదిరిగానే ఇన్వాలిడేషన్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనారోగ్య కారణాలతో పలువురు కార్మికులు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తమ వంతు వచ్చినప్పుడు బోర్డుకు హాజరయ్యేందుకు భయపడుతున్నారని తెలిపారు. అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ ‘ఫిట్ ఫర్ సేమ్...