సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు హెచ్ఎంఎస్ – తెలంగాణ రక్షణ సేన గాంధేయమార్గంలో పోరాడి సాధించిన సంయుక్త విజయం
హైదరాబాద్,అర్జున్ సమాచారం: మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా నెలల తరబడి కాలయాపన చేసిన అప్రజాస్వామిక కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరంకుశ సింగరేణి యాజమాన్యం మా ఉద్యమానికి దిగివచ్చిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు ఈనెల 17, 18 న మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.. ఇది వేలాది మంది సింగరేణి కార్మికుల గెలుపు. వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు. వేలాది మంది కార్మికులు అనారోగ్య సమస్యలతో మెడికల్ ఆన్ ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం...