సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కష్టాలు

కరీంనగర్,అర్జున్ సమాచారం: పొద్దంతా బొగ్గు గనుల్లో కష్టపడి.. చెమటోడ్చి.. సింగరేణి సంస్థ అభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన కార్మికులు.. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత తమ కనీస అవసరాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. వృద్ధాప్యంలో కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన నెలవారీ పెన్షన్.. వారి పాలిట పెను సమస్యగా మారుతోంది. ప్రతి నెల ఒకటో తేదీన ఖాతాల్లో జమ కావాల్సిన పెన్షన్.. గురువారం వరకు కూడా పలువురు రిటైర్డ్ కార్మికులకు అందకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దీపావళి పండుగ వేళ.. కుటుంబ సభ్యులతో...