సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామి వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మూడో రోజు వాహనసేవ సింహ వాహనం.. ధైర్యానికి, పరాక్రమానికి ప్రతీక గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధులు

గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధులు తిరుమల.అర్జున్ సమాచారం: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. సింహ వాహనంపై కొలువుదీరిన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణలతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. భక్తి వైభవంతో సాగిన సింహ వాహనసేవ గోవింద నామస్మరణలతో మార్మోగిన తిరుమాడ వీధుల్లో సింహ వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. ముందుగా గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయంగార్ల వేదఘోష,...