ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 3:55 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సిద్దిపేట ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ప్రజల కంటికి రక్షణ కవచం.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట,అర్జున్ సమాచారం:
హరీష్ రావు మాట్లాడుతూ ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే నిజమైన అభివృద్ధి నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో ఎల్వి ప్రసాద్ సేవలు అందించాం.
డ్రైవర్లు కంటి పరీక్షలు చేపించుకోవాలి
ఉచితంగా కంటి పరీక్షలు, అద్దాలు ఇప్పించే బాధ్యత నాది
సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం.
సిద్దిపేట క్యాంపు కార్యాలయం లో ఆటో ఎలక్ట్రీకల్ అసోసియేషన్ వారికి ఉచితంగా కంటి పరీక్షలు
పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
సిద్దిపేట క్యాంప్ కార్యాలయం లో ఆటో ఎలెక్ట్రీకల్ అసోసియేషన్ వారికి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యం తో ఉచితంగా కంటి పరీక్షల కార్యక్రమం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ. సిద్దిపేట జిల్లా కు చెందిన పేద ప్రజలకు కంటి పరీక్షలు, అవసరమైన ఆపరేషన్లు పూర్తిగా ఉచితంగా నిర్వహించాలని ఉద్దేశ్యం తో సిద్దిపేట లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ని ఏర్పాటు చేసుకున్నామని ఆర్థికంగా సామర్థ్యం ఉన్నవారు చెల్లించవచ్చు, కానీ పేదలకు మాత్రం ఎలాంటి భారం లేకుండా చికిత్స అందించేందుకు ఆసుపత్రి ఎంతో ఉపయోగ పడుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌కు వెళ్లే స్థోమత లేని ఎంతో మంది మన మధ్య ఉన్నారు. అలాంటి వారికి ఇక్కడే నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ఈ కేంద్రం ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే అనేక మందికి చికిత్సలు, ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ముఖ్యంగా మోటార్‌బైక్, బస్సు డ్రైవర్లు, మెకానిక్‌లు, ఎలక్ట్రిషియన్‌లు వంటి వృత్తుల వారికీ ఈ సేవలు ఎంతోఉపయోగ పడుతున్నాయి.40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత చాలామందికి కంటి సమస్యలు వస్తుంటాయి. కానీ చాలా మంది పరీక్షలు చేయించుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి.
===========================