సిద్ధు జొన్నలగడ్డ లాంచ్ చేసిన ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో...