సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళలు అమరావతి

అమరావతి,అర్జున్ సమాచారం: రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి సవిత, మాజీమంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత ఉన్నారు. =================